‘హనుమాన్’ ఏంటీ ఊరింపు.!
- March 12, 2024
కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా ‘హనుమాన్’. చిన్న సినిమాగా విడుదలై ఏకంగా 330 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. అంతేకాదు, 50 రోజుల ధియేటర్ ఫంక్షన్ కూడా చేసుకుంది సక్సెస్ ఫుల్‌గా.
ఈ మధ్య ఏ సినిమా అయినా కేవలం ఓపెనింగ్స్‌కే పరిమితమైపోయింది. అంతగా కాదంటే.. కష్టపడి ఓ వారం రోజులు నిలవడం గగనమైపోయింది.
అలాంటిది ‘హనుమాన్’ 50 రోజులు సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్లలో ప్రదర్శించబడింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమాని ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడాలని ఎదురు చూస్తున్న వారు చాలా మంది వున్నారు.
కానీ, ఓటీటీ రిలీజ్‌పై ఇంకా డైలమా కొనసాగుతోంది. సంక్రాంతికి ‘హనుమాన్’తో రిలీజైన సినిమాలన్నీ ఓటీటీలోనూ రిలీజై తుస్సు మన్న టాక్ తెచ్చుకున్నాయ్.
కానీ, ‘హనుమాన్’ మాత్రం అదే ఇంటెన్షన్‌తో ఓటీటీ రిలీజ్ పైనా ఆసక్తి క్రియేట్ చేస్తోంది. మార్చి2న ఓటీటీలో హనుమాన్ రిలీజ్ అన్నారు. రాలేదు. శివరాత్రి సందర్భంగా మార్చి 8న పక్కా అంటూ ప్రచారం జరిగింది. అదీ కుదరలేదు.
తాజాగా ఓటీటీ రిలీజ్‌పై ఇంకా ఏ డేట్ ఫిక్స్ చేయలేదని ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న ఓటీటీ సంస్థ జీ 5 ఛానెల్ వాళ్లు ప్రకటించారు. చూస్తుంటే.. 100 డేస్ ఫంక్షన్ జరుపుకున్నాక కానీ, ఓటీటీలో ‘హనుమాన్’ వచ్చేలా కనిపించడం లేదు. ఏది ఏమైనా ఓ సినిమాని ఇష్టపడితే.. జనంలో ఆసక్తి ఈ విధంగా వుంటుంది.. అని ‘హనుమాన్’ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది.
తాజా వార్తలు
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!
- ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- సౌదీ అరేబియా పై హూతీల దాడులు: 73 మంది పౌరులకు గాయాలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!







