రవితేజ ఒప్పుకుంటే ఆ ప్రాజెక్ట్‌కి సై అంటోన్న నిర్మాత.!
- March 12, 2024
మాస్ రాజా రవితేజ, జేజమ్మ అనుష్క జంటగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమార్కుడు’. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అయిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. అప్పట్లో ఓ సంచలనమే ఈ చిత్రం.
విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందించారు. రాధా మోహన్ నిర్మించారు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందించాలనుకుంటున్నారట నిర్మాత రాధా మోహన్.
ఎప్పటి నుంచో ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట ఆయన. అందుకు కథ కూడా సిద్ధంగానే వుందట. కానీ, రాజమౌళి ప్లేస్‌లో సంపత్ నంది డైరెక్షన్ వహించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.
అయితే, ‘విక్రమార్కుడు 2’ని రవితేజతోనే తెరకెక్కించాలన్నది రాధా మోహన్ డ్రీమ్. అలాగే అనుష్క వుంటే బాగుండనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు అనుష్క వున్న పరిస్థితుల్లో రవితేజ పక్కన హీరోయిన్‌గా ఊహించుకోలేం. అలాగే, సంపత్ నంది కూడా తన సినిమాలతో ప్రస్తుతం బిజీగా వున్నారు.
రవితేజను ఒప్పించడం కూడా ఏమంత సులువైన మార్గం కాదు. ఎందుకంటే, ఆయన ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్టులు అనేకం వున్నాయ్. ఇలా.. ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు అనేక రకాల అడ్డంకులున్నాయ్.
కానీ, రాధా మోహన్ మాత్రం ఈ సినిమా టైటిల్‌ని రిజిస్టర్ చేయించి ఎప్పటికైనా రవితేజతోనే పట్టాలెక్కించాలన్న పట్టుదలతో వున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం మరింత బలోపేతం: GCC
- ఒమన్‌లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్‌లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్‌లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!







