మక్కా, మదీనాలలో సమగ్ర భద్రతా ప్రణాళిక..సౌదీ

- March 12, 2024 , by Maagulf
మక్కా, మదీనాలలో సమగ్ర భద్రతా ప్రణాళిక..సౌదీ

మక్కా: ర‌మదాన్ ఉపవాస నెల ప్రారంభమైనందున.. పవిత్ర మాసంలో పవిత్రమైన మక్కా మరియు మదీనాలకు ఉమ్రా యాత్రికులు, సందర్శకుల రావ‌డం ప్రారంభ‌మైంది.  అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అన్ని సంబంధిత సౌదీ భద్రతా దళాలు తమ సిబ్బంది,  వనరులపైన స‌మీక్ష నిర్వ‌హించింది. ప‌విత్ర మాసంలో ఆధ్యాత్మికతతో కూడిన వాతావరణంలో ఆరాధకులు తమ ఆచారాలను సులభంగా మరియు సౌకర్యవంతంగా నిర్వహించడానికి వీలుగా భద్రతా దళాల సీనియర్ అధికారులు ఒక సమగ్ర భద్రతా ప్రణాళికను,  బలగాల సంసిద్ధతను ప్రకటించారు. శనివారం మక్కాలోని యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్‌లో ఉమ్రా భద్రతా దళాల కమాండర్ల సంయుక్త విలేకరుల సమావేశంలో పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అల్-బస్సామి మాట్లాడుతూ.. అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఉమ్రాకు ఆమోదం తెలిపారు. యాత్రికుల‌ భద్రతకు అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భద్రతా దళాలు ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు వద్ద భక్తులకు సేవ‌లు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. అనేక భాషలను మాట్లాడగల అర్హత కలిగిన సిబ్బందితో సపోర్టింగ్ సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. అందుకోసం బయోమెట్రిక్ పరికరాలు, ఫోర్జరీ డిటెక్షన్ పరికరాలు మరియు సంబంధిత భద్రతా డాక్యుమెంటేషన్ పరికరాలు వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉప‌యోగిస్తున్నట్లు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com