సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని
- March 12, 2024
న్యూ ఢిల్లీ: సికింద్రాబాద్-విశాఖ రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ప్రధాని మోడీ ఈరోజు వర్చవల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 6 రోజుల పాటు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఒక్క గురువారం రోజు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100 శాతం కన్నా ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తోంది. కొత్త వందేభారత్ సాధారణ సేవలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు మార్చి 13 నుంచి, సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మార్చి 15 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ..రైల్వే ట్రాకులపైనే తన జీవితం మొదలైందని మోడీ చెప్పుకొచ్చారు. అందుకే ఇంతముందుకు మన రైల్వేలు ఎంత అధ్వాన్నంగా ఉండేవో తనకు తెలుసని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయ రైల్వే అభివృద్ధిపై ప్రత్యే శ్రద్ధ పెట్టామని వెల్లడించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మొత్తం 10 వందేభారత్‌లను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
గత 10 ఏళ్లలో రైల్వేల అభివృద్ధికి గతంలో చేసిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. సామాన్యులు లగ్జరీగా ప్రయాణించేలా భారతీయ రైల్వేను తీర్చిదిద్దేందుకు కృషి చేశాం. 2024లో కేవలం రెండు నెలల్లోనే రూ.11లక్షల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించాం. భారత్‌ను యువకుల దేశం. అత్యంత ఎక్కువ యువశక్తి భారత్లో ఉంది. మేము వేసే పునాదులు యువత దివ్యమైన భవిష్యత్‌కు గ్యారంటీ. మా పది సంవత్సరాల పని కేవలం ట్రైలర్ మాత్రమే. మరింత ముందుకు వెళ్లాల్సి ఉంది.” అని ప్రధాని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







