గుడ్‌న్యూస్.. ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు
- March 12, 2024
ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్న వారికి UIDAI గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.
ఫ్రీగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే గడువు 2024 మార్చి 14వ తేదీతో ముగుస్తుండటంతో.. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు UIDAI తెలిపింది. మరో మూడు నెలల పాటు ఈ గడువుని పొడిగించినట్లు UIDAI పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు.
ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని 2024 జూన్ 14వ తేదీ వరకు పొడిగించారు. దాంతో..ఇంట్లో ఉండే ఆధార్ కార్డులోని వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సేవలను పొడగించడంతో లక్షల మంది ఆధార్ కార్డు ఉన్నవారికి ఈ ప్రయోజనం అందనుంది. అయితే.. ఉచిత సేవలు కేవలం మైఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రజలు తమ ఆధార్ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచుకునేందుకు UIDAI ప్రోత్సహిస్తోనట్లు ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు. ఆధార్‌ను ప్రతి ఒక్కరూ పదేళ్లకు ఒక్కసారి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు అయితే బ్లూ ఆధార్‌ను ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల తర్వాత వారికి రెగ్యులర్ ఆధార్ కార్డును జారీ చేస్తారు.
ఇక ఇలాంటి వారికి ఉచిత ఆధార్ అప్‌డేట్ అవకాశం ఉపయోగపడుతుందని UIDAI తెలిపింది. ఆధార్ కార్డును అప్డేట్ చేసేందుకు గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఉచితంగా ఆధార్ అప్డేట్ కోసం ఆన్‌లైన్ లో https://myaadhaar.uidai.gov.in పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష