హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం..

- March 12, 2024 , by Maagulf
హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం..

హర్యానా: హర్యానా రాజకీయాల్లో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీతో పాటు మరో అయిదుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

మనోహర్ లాల్ ఖట్టర్, కేబినెట్ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత నూతన సీఎంగా నయాబ్ సింగ్ సైనీ (CM Nayab Singh Saini) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కన్వర్ పాల్, మూల్ చంద్ శర్మ, జై ప్రకాష్ దలాల్, బన్వారీ లాల్, రంజిత్ సింగ్ చౌతాలాలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన నయాబ్.. గతేడాది అక్టోబర్‌లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1996లో అయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 2000 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి పనిచేశారు. 2002లో అంబాలాలో బీజేపీ యూత్ వింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2005లో అంబాలాలో జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

కొత్తగా ఏర్పడిన కేబినెట్ లోని కన్వర్ పాల్ 2014 నుంచి 2019 వరకు హర్యానా శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. రెండుసార్లు జగద్రి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జై ప్రకాష్ దలాల్ 2019లో లోహారు నుంచి హర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన వివిధ పదవులు అధిష్ఠించారు. బన్వారీ లాల్ 2019లో బవాల్ నుంచి గెలుపొందారు. రంజిత్ సింగ్ చౌతాలా స్వతంత్ర ఎమ్మెల్యే. ఈయన అంతకుముందు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జనతాదళ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరియు బీజేపీలో సభ్యుడుగా ఉన్నారు. చౌతాలా 2019 ఎన్నికల్లో రానియా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. తన మనవడు దుష్యంత్ చౌతాలాతో కలిసి, 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమిలో బీజేపీలో చేరారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com