అధ్యక్ష పోటీకి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాల ఖరారు
- March 13, 2024
అమెరికా: ఈ ఏడాది నవంబర్‌లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ పోటీ పడనున్నారు. కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. తాజాగా జార్జియా ప్రైమరీ ఎన్నికల్లో బైడెన్ గెలుపొంది డెమోక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు. పార్టీ నుంచి నామినేట్ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను జో బైడెన్ పొందారు. అటు వాషింగ్టన్, మిస్సిసిపీ, నార్తర్న్ మరియానా, ఐలాండ్స్‌లోనూ ఆయన విజయఢంకా మోగించడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
ఇక జార్జియాలో విక్టరీ తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించారు. “ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల చేతిలో ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన భద్రతను, స్వేచ్ఛను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని దూరం చేసేవారికి అవకాశం ఇస్తారా?” అని బైడెన్ అన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష