రమదాన్.. మసీదుల దగ్గర పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలు
- March 13, 2024
బహ్రెయిన్: పవిత్ర రమదాన్ మాసంలో మసీదుల దగ్గర పార్కింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ చట్టాలు మరియు నిబంధనలకు వాహనాల డ్రైవర్లు కట్టుబడి ఉండాలని బహ్రెయిన్‌లోని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరి భద్రతను కాపాడటానికి వాహనదారులు ఇఫ్తార్, ఉపవాస విరమణకు ముందు గంటలలో ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ అబ్దుల్ వహాబ్ అల్ ఖలీఫా కోరారు. ఇతరుల హక్కులను గౌరవిస్తూనే, పబ్లిక్ ఆర్డర్‌కు కట్టుబడి ఉండాలని, ముఖ్యంగా నివాస ప్రాంతాలలో శాంతిని కాపాడాలని తెలిపారు. “మసీదులు వంటి ప్రార్థనా స్థలాల వద్ద సరైన పార్కింగ్, వృద్ధులు రోడ్డు దాటుతున్నప్పుడు వారి పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో ట్రాఫిక్ ప్రమాదాలను నివారించాలి. ముఖ్యంగా ప్రార్థన సమయాల్లో మరియు సాయంత్రం వేళల్లో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి ” అని కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష