గోల్డెన్ వీసా.. Dh2 మిలియన్ల విలువైన ప్రాపర్టీలకు డిమాండ్
- March 13, 2024
దుబాయ్: 10-సంవత్సరాల రెసిడెన్సీకి అర్హత పొందేందుకు కనీసం 1 మిలియన్ దిర్హామ్‌ల డౌన్ పేమెంట్‌ని దుబాయ్ తొలగించిన నేపథ్యంలో Dh2 మిలియన్ల విలువైన ఆస్తులకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు మాట్లాడుతూ.. దుబాయ్‌లోని చాలా మంది ప్రాపర్టీ డెవలపర్‌లు Dh2-మిలియన్ ప్రాపర్టీలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా అపార్ట్‌మెంట్‌ల పరిమాణాన్ని పెంచుతున్నారని, అయితే Dh1.5-మిలియన్-ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్‌లతో పెట్టుబడిదారులు 10 సంవత్సరాల రెసిడెన్సీ అర్హత థ్రెషోల్డ్‌ను చేరుకోవడానికి తమ బడ్జెస్‌ను పెంచుతున్నారని చెప్పారు. పెట్టుబడిదారుల కోసం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టినప్పటి నుండి రియల్ ఎస్టేట్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిందని, భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలాగే నగరంలో పెరుగుతున్న అద్దెలను అధిగమించడానికి ఇప్పటికే ఉన్న అద్దెదారులను యాజమాన్యం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోందని స్ప్రింగ్‌ఫీల్డ్ ప్రాపర్టీస్ సీఈఓ ఫరూక్ సయ్యద్ తెలిపారు. జనవరిలో దుబాయ్ పెరుగుతున్న రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేందుకు గోల్డెన్ వీసాకు అర్హత పొందేందుకు కనీసం 1 మిలియన్ దిర్హామ్‌ల డౌన్‌పేమెంట్ అవసరాన్ని దుబాయ్ తొలగించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష