16న అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్
- March 13, 2024
అమరావతి: సీఎం జగన్ ఈనెల 16న ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు ఇచ్చాపురం కి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైఎస్‌ఆర్‌సిపి నేతలు, కార్యకర్తలు.
కాగా, రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు సీఎం జగన్. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







