రమదాన్ లో ప్రమాదాలు అధికం.. వాహనదారులకు కీలక సూచనలు జారీ

- March 15, 2024 , by Maagulf
రమదాన్ లో ప్రమాదాలు అధికం.. వాహనదారులకు కీలక సూచనలు జారీ

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాసం ఉన్న వారందరికీ రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా కార్యాలయాలు మరియు పాఠశాలలు వేర్వేరు సమయాలను అమలు చేస్తున్నాయి. గత ఏడాది పవిత్ర మాసంలో జరిగిన ప్రమాద క్లెయిమ్‌లను అధ్యయనం చేసిన దుబాయ్‌కి చెందిన ఒక బీమా కంపెనీ, రమాదాన్ సందర్భంగా రోడ్లపై చాలా ప్రమాదాలు జరుగుతున్నందున వాహనదారులు మధ్యాహ్నం 1 గంటల నుండి 4 గంటల మధ్య అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారాలు అత్యంత ప్రమాదకరమైన రోజుగా, అయితే వారాంతాల్లో రహదారి వినియోగదారులకు అత్యంత సురక్షితమైనవని పేర్కొన్నారు.

బీమా ప్రొవైడర్ టోకియో మెరైన్,  రోడ్‌సేఫ్టీ యూఏఈ లు 2023 మార్చి 22 నుండి ఏప్రిల్ 20 వరకు 1,320 మోటార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను సంయుక్తంగా విశ్లేషించి, రహదారి వినియోగదారులను రక్షించడానికి అవగాహన పెంచుకున్నారు. 

రోడ్డు ప్రమాదాల్లో మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీక్ యాక్సిడెంట్ డే టైమ్‌. ఈ సమయంలో 35 శాతం, ఆ తర్వాత ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు  21 శాతం ప్రమాదాలు జరిగాయి.  మిడ్‌వీక్ లేదా బుధవారం 19 శాతం ప్రమాదాలతో అత్యంత ప్రమాదకరమైన పనిదినంగా, సోమవారం మరియు గురువారాలు రెండూ 16 శాతం, మంగళవారాల్లో 15 శాతం ప్రమాదాలు,శుక్రవారం 13 శాతం ప్రమాదాలు నమోదు అయ్యాయి. ఇక వారాంతాల్లో లేదా శని మరియు ఆదివారాల్లో వరుసగా 12 మరియు 9 శాతం ప్రమాదాలు తక్కువగా ఉన్నాయి. 30-39 సంవత్సరాల వయస్సు గల వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురి అవుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఆ తర్వాత 40-49 సంవత్సరాల వయస్సు గల వారు ఉన్నారు.  వాహనదారులు,పాదచారులు, మోటార్‌సైకిల్ రైడర్లు, ద్విచక్రవాహనదారులు మొదలైనవారు రమదాన్ సందర్భంగా మరింత జాగ్రత్తగా ఉండాలని రోడ్‌సేఫ్టీ యూఏఈ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ థామస్ ఎడెల్‌మాన్ సూచించారు. మరోవైపు రమదాన్ సందర్భంగా అలసిపోయినట్లు లేదా నిద్రపోతున్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) వాహనదారులకు పిలుపునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com