బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు
- March 15, 2024
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో దాడులు సోదాలు జరుగుతున్నాయి. దీంతో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో ఈడీ విచారణను తప్పుబడుతూ గతంలో కవిత పిటిషన్ వేశారు. మహిళలను తమ ఇంట్లోనే విచారించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంను కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. మరోవైపు పలుమార్లు కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా ఆమె విచారణకు హాజరుకాలేదు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష