అమెరికాలో NATS కోడ్ ఎ బిట్ వర్క్‌షాప్
- March 16, 2024
అమెరికా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ప్లోరిడాలోని టంపాబే లో కోడ్ ఎ బిట్ వర్క్ షాప్ పేరిట తెలుగు విద్యార్ధులకు కోడింగ్ పై అవగాహన కల్పించింది. విద్యార్ధులకు టెక్నాలజీపై ఆసక్తి పెంచేలా ఈ వర్క్ షాప్ నడిచింది. విద్యార్ధుల పరిజ్ఞానం, నైపుణ్యాలను అంచనా వేయడానికి కోడింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. తెలుగు విద్యార్ధుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు తల్లిదండ్రులు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ కార్యక్రమం కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్, తక్షణ మాజీ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్), భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో-ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భావితరంలో కోడింగ్ నైపుణ్యాలు గురించి అవగాహన నింపేందుకు కోడింగ్ వర్క్‌షాప్‌ను చేపట్టి విజయవంతం చేసిన టంపాబే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టంపాబే విభాగం కోడింగ్ వర్క్‌షాప్ నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టంపాబే నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళీ కృష్ణ మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







