సర్‌ప్రైజింగ్ రోల్‌లో బేబమ్మ.!
- March 16, 2024
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పంజాకీ, అందాల భామ కృతి శెట్టికీ తొలి సినిమా అయిన ‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. కోవిడ్ టైమ్‌లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాతో బేబమ్మగా కృతి శెట్టి కుర్రోళ్ల హుృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
అంతేకాదు, టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్ అనిపించుకుంది కూడా. కానీ, కాలం కలిసి రాలేదు. తొలి సినిమా తప్ప.. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్.
దాంతో, ఐరెన్ లెగ్ ట్యాగ్ వేసేసి.. అమ్మడిని టాలీవుడ్ పక్కన పెట్టేసింది. దాంతో బేబమ్మ గ్యాప్ తీసుకుంది. తాజాగా శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మనమే’ సినిమాతో మళ్లీ బేబమ్మ కృతి శెట్టి టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌లో కృతి శెట్టిని చూసి అందరూ షాకయ్యారు. అందుకు కారణం.. ఈ సినిమాలో ఓ బిడ్డకి తల్లిగా కృతి శెట్టి కనిపించబోతోంది. ‘మనమే’ ఓ డిఫరెంట్ సెంటిమెంట్ మూవీలా కనిపిస్తోంది.
తండ్రీ కొడుకు సెంటిమెంట్‌తో రూపొందే సినిమాలా తోస్తోంది. ఈ మధ్య ఈ తరహా సెంటిమెంట్ సినిమాలు బాగానే వర్కవుట్ అవుతున్నాయ్. అలా ‘మనమే’ హిట్టయితే మళ్లీ బేబమ్మని టాలీవుడ్‌లో ఇంకొన్ని రోజులు గుర్తు పెట్టుకోవచ్చన్న మాటే.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







