‘సేవ్ ద టైగర్స్ సీజన్ 2’.! నవ్వుకున్నోళ్లకి నవ్వుకున్నంత.!
- March 16, 2024
ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో గతేడాది ఓటీటీలో రిలీజైన ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా.. అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుందీ వెబ్ సిరీస్.
ఇప్పుడు ఈ సిరీస్‌కి సీక్వెల్ వచ్చింది. మొదటి సీజన్ ఇంపాక్ట్‌తో ఈ సిరీస్ పైనా అంచనాలు బాగానే వున్నాయ్. ఈ సారి కథ మొత్తం పోలీసులు చుట్టూ తిరుగుతుంది. హంస లేఖను హత్య చేశారన్న అనుమానంతో అరెస్టయిన ముగ్గురు హీరోల్ని ఎలాగైనా విడిపించుకోవాలంటూ వారి భార్యలు పడే తాపత్రయమే ఈ రెండో సిరీస్ కథ.
దాని చుట్టూ ఫన్ బాగానే జనరేట్ చేశారు దర్శక త్రయం కొత్తపల్లి అరుణ్, మహి వి రాఘవ, అద్వైత్. అయితే, ఈ సారి సీజన్‌లో ఫన్ డోస్‌తో పాటూ కాస్త ఎమోషన్ కూడా మిక్స్ చేశారు. భార్యలపై ఫ్రస్టేషన్ ఫీలయ్యే భర్తల కథ చాలా మందికి నేచురల్‌గా కనెక్ట్ అవుతుంది.
మొదటి సీజన్‌తో పోల్చితే ఈ సీజన్‌లో డ్రామా బాగా వర్కవుట్ అయ్యింది. కామెడీ కాస్త తగ్గినట్లు అనిపించినా బోర్ అనిపించదు ఓవరాల్‌గా. ఇంకెందుకాలస్యం.. ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌ని చూసి హాయిగా ఆనందించండి.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష