భారత దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..
- March 16, 2024
న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు కోడ్ అమల్లోకి రావడంతో మంత్రులు, ఇతర అధికారులు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడానికి వీలు ఉండదు. శంకుస్థాపనలు లేదా ఏ రకమైన ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించకూడదు.
రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు కల్పించడం మొదలైన వాటికి సంబంధించిన హామీలు ఇవ్వకూడదు. దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను జరపడానికి దాని రాజ్యాంగ అధికారం ప్రకారం ఈసీఐ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో ఈ నిబంధనలను అమలు చేస్తుంది. ఎన్నికల సర్వేలను ప్రకటించకూడదు. ప్రభుత్వ అధికారులను పార్టీలు ఎన్నికల కోసం వాడుకోకూడదు.
ఎలాంటి లోపాలు లేకుండా ఎన్నికలు జరపాలన్నదే తమ లక్ష్యమని ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అన్నారు. అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకోవచ్చని చెప్పారు. కేవైసీ యాప్ లో అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఎవరైనా తాయిలాలు, నగదు పంచితే ఫొటో తీసి తమకు పంపాలన రాజీవ్ కుమార్ కోరారు.
సెల్ ఫోన్ లొకేషన్ ను బట్టి 100 నిమిషాల్లో ఆ ప్రాంతానికి చేరుకుంటామని చెప్పారు. ధనబలం, కండబలం నియంత్రణ తమ ముందు ఉన్న పెద్ద సవాల్ అని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు స్వీకరిస్తామని వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష