ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభం
- March 16, 2024
మస్కట్: ధోఫర్ లో ఆటం సీజన్ పర్యాటకం ప్రారంభమైంది. 2023 ఆటం సీజన్‌లో ధోఫర్ గవర్నరేట్‌లో పర్యాటక ప్రవాహం వృద్ధి రేటు 18.4%కి చేరుకుంది. సలాలా విమానాశ్రయానికి వింటర్ సీజన్‌లో చార్టర్ విమానాల సంఖ్య 239 డైరెక్ట్ ఫ్లైట్‌లకు చేరుకుంది. వింటర్ సీజన్‌లో 5 మరియు 4 నక్షత్రాల కేటగిరీల హోటల్ ఆక్యుపెన్సీ రేటు 95% కంటే ఎక్కువగా పెరిగిందని దోఫర్ గవర్నరేట్‌లోని హెరిటేజ్ అండ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ అబ్రి తెలిపారు. దోఫర్ గవర్నరేట్‌లోని వివిధ ప్రదేశాలలో అనేక పర్యాటక ప్రాజెక్టులు పూర్తియినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మౌంట్ సమ్హాన్‌లోని “హేవార్” గుహ ప్రత్యేకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన తర్వాత ఈ సంవత్సరమే సదా కోటను సందర్శకుల కోసం ప్రారంభిస్తామని, అలాగే ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా పెట్టుబడి సంస్థ రఖ్యూత్ కోటను ప్రారంభించనున్నట్లు అల్-అబ్రి వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష