'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్' కేసు ఏప్రిల్ 18కి వాయిదా

- March 16, 2024 , by Maagulf
\'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్\' కేసు ఏప్రిల్ 18కి వాయిదా

యూఏఈ: అబుదాబి ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్‌లోని స్టేట్ సెక్యూరిటీ ఛాంబర్ ఉగ్రవాద 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్'కు సంబంధించిన కేసు విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. యూఏఈ 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ' అని పిలిచే రహస్య ఉగ్రవాద సంస్థను స్థాపించి, నిర్వహిస్తున్నారని ఈ కేసులో 84 మంది నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం మూడున్నర గంటలకు పైగా వాదనలు విన్నది. నిందితుల తరఫు న్యాయవాదులు ప్రాసిక్యూషన్ సమర్పించిన అభియోగాల చెల్లుబాటును సవాలు చేశారు.  తమ క్లయింట్‌లను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  అయితే, వారి వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ తిప్పికొట్టింది. నిందితులపై అన్ని సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com