'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్' కేసు ఏప్రిల్ 18కి వాయిదా
- March 16, 2024
యూఏఈ: అబుదాబి ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్‌లోని స్టేట్ సెక్యూరిటీ ఛాంబర్ ఉగ్రవాద 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ ఆర్గనైజేషన్'కు సంబంధించిన కేసు విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. యూఏఈ 'జస్టిస్ అండ్ డిగ్నిటీ కమిటీ' అని పిలిచే రహస్య ఉగ్రవాద సంస్థను స్థాపించి, నిర్వహిస్తున్నారని ఈ కేసులో 84 మంది నిందితులుగా ఉన్నారు. న్యాయస్థానం మూడున్నర గంటలకు పైగా వాదనలు విన్నది. నిందితుల తరఫు న్యాయవాదులు ప్రాసిక్యూషన్ సమర్పించిన అభియోగాల చెల్లుబాటును సవాలు చేశారు. తమ క్లయింట్లను నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వారి వాదనలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ తిప్పికొట్టింది. నిందితులపై అన్ని సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయని పేర్కొన్నది.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







