కుళ్ళిన మాంసం అమ్మకాలపై జరీమానా

- June 04, 2016 , by Maagulf
కుళ్ళిన మాంసం అమ్మకాలపై జరీమానా



మినిస్ట్రీ ఆఫ్‌ ఎకానమీ అండ్‌ కామర్స్‌ (ఎంఇసి), వినియోగదారుల హక్కుల రక్షణ నేపథ్యంలో విస్తృతమైన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఎంఇసి అధికారులు 134 బచర్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, అందులో 14 షాపులకు జరీమానా విధించింది. ఈ షాపుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్ళిన మాంసం ఈ దుకాణాల్లో విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 3000 ఖతారీ రియాల్స్‌ నుంచి 1 మిలియన్‌ ఖతారీ రియాల్స్‌ వరకు జరీమానా విధించబడుతుంది. నిబంధనల ఉల్లంఘనపై వినియోగదారులు ఫిర్యాదులు చేయవచ్చునని అధికారులు సూచించారు. కాల్‌ సెంటర్‌ లేదా ఇ-మెయిల్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఐఫోన్‌ మరియు ఆండ్రాయిడ్‌ సర్వీసుల్లో ఎంఇసి అప్లికేషన్‌ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com