రేపటి నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- March 17, 2024
ఇటీవల వాతావరణంలో చాల మార్పులు వస్తున్నాయి. వర్ష కాలంలో ఎండలు , ఎండ కాలంలో వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే క్రమంలో ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది.
ఈ నెల 21 వరకు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడుతాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేసింది.
తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ఇప్పుడు మరఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడును దాటి కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించింది. దీని ఫలితంగా, మార్చి 20 వరకు మధ్య తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్‌లు అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలపై దీని ప్రభావం ఉండనుంది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







