ఘనంగా డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల వేడుక

- March 17, 2024 , by Maagulf
ఘనంగా డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాల వేడుక

న్యూ ఢిల్లీ: తెలుగు, హిందీ భాషల అభివృద్ది అచార్ల యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అందిస్తున్న సేవలు ఎంచదగినవని మిజోరాం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. బహుబాషా కోవిదుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్య సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను ఆదివారం డిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కార వేడుకలో ఘనంగా సన్మానించారు. సంస్ద 35వ వార్షిక సాంస్కృతిక, ఉగాది పురస్కారాల వేడుక డిల్లీలోని గోదావరి ఆడిటోరియం వేదికగా నిర్వహించగా, అచార్య యార్లగడ్డకు 2024 సంవత్సరానికి గాను డాక్టర్ ఎన్ వి ఎల్ నాగరాజు స్మారక అవార్డును మిజోరాం గవర్నర్ అందించారు. ఈ సందర్బంగా గవర్నర్ కంభంపాటి మాట్లాడుతూ జాతీయ భాష హిందీ, మాతృ భాష తెలుగు వికాసానికి యార్లగడ్డ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.  విశ్వ హిందీ పరిషత్తు జాతీయ అథ్యక్షుని హోదాలో దేశ విదేశాలలో హిందీ భాష ఉన్నతి కోసం యార్లగడ్డ పడుతున్న తపన ఆదర్శనీయమన్నారు. నన్మాన గ్రహీత అచార్య యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగులో ఎంతో మంది కవులు  అందించిన సాహిత్యం దేశ వ్యాప్తం కావాలంటే వాటికి హిందీ అనువాదం అవసరమన్నారు. అనువాద ప్రకియ బలంగా సాగితే తెలుగు కవుల గొప్పదనం విశ్వవ్యాప్తం అవుతుందన్నారు. డిల్లీ తెలుగు అకాడమీతో పాటు గ్లోబల్ తెలుగు అకాడమీ సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకోగా, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సంయిక్తంగా న్యాయమూర్తులు, పలువురు సీనియర్ ఐఎఎస్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com