అధికారులకు సేవా పతకాలు అంద‌జేసిన సుల్తాన్

- March 18, 2024 , by Maagulf
అధికారులకు సేవా పతకాలు అంద‌జేసిన సుల్తాన్

మస్కట్:  SSF దినోత్సవం సందర్భంగా సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ (SSF)కి చెందిన అనేక మంది అధికారులు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్‌లకు సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్  సేవా పతకాలను, రాయల్ మెమోన్‌డేషన్‌ను ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 15న SSF దినోత్సవాన్ని జ‌రుపుకుంటారు. అసుమూద్ గారిసన్‌లో జరిగిన కార్యక్రమం SSF కమాండర్ మేజర్ జనరల్ ముసల్లం మహమ్మద్ జాబూబ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. మేజర్ జనరల్ జాబుబ్ ఉత్త‌మ సేవ‌ల‌ను అందించిన‌ సిబ్బందిని సత్కరించారు. సుప్రీమ్ కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో వారి ఉన్నత పనితీరును కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com