రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరోసారి ఎన్నిక..
- March 18, 2024
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. రష్యాలో మూడు రోజుల పాటు పోలింగ్ జరిగింది. మొత్తం 60 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది. అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన తర్వాత పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా, నాటో మిలిటరీ కూటమి మధ్య యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఈ యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో అన్నీ సాధ్యమేనన్నారు.
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చర్చించేందుకు ఫ్రాన్స్ తో పాటు ఇంగ్లండ్‌ను ఎంచుకున్నామని పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో అణ్వాయుధాలను వాడాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.
ఇటువంటి ఆలోచన తమకు ఎన్నడూ రాలేదని అన్నారు. కాగా, మార్చి 15 నుంచి 17 వరకు రష్యా ఎన్నికలు జరిగాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యాపై దాడులను పెంచింది. రష్యా సరిహద్దు ప్రాంతాలపై దాడులు జరిగాయి. దీంతో రష్యా మరింత ఆగ్రహంగా ఉంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష