దాడికి కుట్ర.!!
- June 04, 2016
ఈ ఏడాది జరగనున్న అమర్నాథ్ యాత్రపై మిలిటెంట్లు దాడి చేసే అవకాశం ఉందని సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ కెకె. శర్మ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో జరిగే అమర్నాథ్ యాత్రలో పాల్గొనే భక్తులపై దాడులు జరపడానికి మిలిటెంట్లు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు హాజరయ్యే భక్తుల భద్రతకై తాము అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. నిన్న బీఎస్ఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేస్తారని వూహించలేదన్నారు.
ఈ దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో మృతి చెందిన జవాన్లకు జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







