TWA-Q ఆధ్వర్యంలో దోహాలో ‘కమ్యూనిటీ ఇఫ్తార్’
- March 19, 2024
దోహా: తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ - ఖతార్ (TWA-Q) దోహాలోని అబు హమూర్లోని ఐన్ ఖలేద్లోని ఉమ్ అల్ సెనీమ్ పార్క్ లో కమ్యూనిటీ ఇఫ్తార్ ని మార్చి 15వ తేదీన నిర్వహించింది. ముఖ్యఅతిథి ఖతార్‌లోని భారత రాయబారి హెచ్.ఇ. విపుల్ తోపాటు షానవాస్ బావ (ఐసిబిఎఫ్ అధ్యక్షుడు), దీపక్ శెట్టి (వైస్ ప్రెసిడెంట్ ఐసిబిఎఫ్), వర్కీ బోబన్ కె (జనరల్ సెక్రటరీ ఐసిబిఎఫ్), అబ్దుల్ రవూఫ్ కొండోయిట్టి (హెడ్ ఆఫ్ ICBF ఇన్సూరెన్స్ & కమ్యూనిటీ వెల్ఫేర్), సత్యనారాయణ మలిరెడ్డి (మేనేజింగ్ కమిటీ మెంబర్ ICC), ICBF అసోసియేటెడ్ ఆర్గనైజేషన్స్(AOs) ప్రతినిధులు, ఖతార్‌లోని ఇతర కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. TWA-Q ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను భారత రాయబారి ప్రశంసించారు. భవిష్యత్ లోనూ ఇదే వేగంతో ముందుకుపోవాలని అభినందించారు. TWA-Q ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ.. తెలంగాణా వెల్ఫేర్ అసోసియేషన్ - ఖతార్ (TWA-Q) ఈ పవిత్ర రమదాన్ మాసంలో ఖతార్‌లో ఉంటున్న తమ కమ్యూనిటీ సభ్యులను ఒకచోటకు చేర్చిందన్నారు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోనవీద్ దస్తగిర్, రమేష్ పిట్ల, మహమ్మద్ షోయబ్, మహమ్మద్ సలావుద్దీన్, నాగరాజు, సయ్యద్ బకర్, కృష్ణ, మిస్టర్ గులాం రసూల్, తాహా, నదీమ్, తల్హా, అమెర్, వసీమ్, ఫిరోజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు