MyHassad ఫిబ్రవరి డ్రా: BD50,000 గెలుచుకున్న ఐదుగురు విజేతలు
- March 20, 2024
బహ్రెయిన్: అహ్లీ యునైటెడ్ బ్యాంక్ (AUB) తన తాజా MyHassad నెలవారీ డ్రాలో ఒక్కొక్కరికి BD10,000 చొప్పున ఐదుగురు అదృష్ట విజేతలను ప్రకటించింది. ఫైసల్ సాద్ సమ్రా, హసన్ అహ్మద్ అలీ, అమీనా నాసర్ రమదాన్, హంజా ఇసా అల్హమర్ మరియు జైనాబ్ అహ్మద్ మొహమ్మద్ విజేతలుగా నిలిచారు. సీఫ్ జిల్లాలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో విజేతలకు బహుమతులను అందజేశారు. MyHassad సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఐదుగురు విజేతలకు BD 10,000 నెలవారీ బహుమతులు, 10 మంది విజేతలకు BD 500 బహుమతులు అందించడంతో పాటుగా జూలై, మే నెలలలో BD 500,000 భారీ బహుమతితో పాటు BD 100,000 ప్రత్యేక బహుమతులను అందించనున్నారు. BD 100,000 మొదటి ప్రత్యేక డ్రా ఈ మార్చిలోనే జరుగనుంది. BD 5000 మరియు అంతకంటే ఎక్కువ విలువైన MyHassad ఖాతాలో పొదుపు బ్యాలెన్స్‌లు ఉన్నవారి నుంచి విజేతలను ఎంపిక చేస్తారు. మార్చి 20వ తేదీలోపు డిపాజిట్లు ఉన్నవారు ఈ డ్రాకు అర్హులని ప్రకటించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు