‘గేమ్ చేంజర్’ రిలీజ్ డేట్‌లో స్పష్టత ఆ రోజే రానుందా.?
- March 21, 2024
గ్లోబల్ స్టార్ అనిపించుకున్న రామ్ చరణ్ తన సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ అంటే తెలియని వాళ్లు లేరనడం అతిశయోక్తి అనిపించదేమో అన్నంతగా ఆయన పేరు మార్మోగాపోతోంది.
అలాంటి రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. అయితే, షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దాంతో, రిలీజ్ డేట్‌పై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో వుంటుందని అంటున్నారు. అయితే, త్వరలో రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ స్పష్టత ఇవ్వనున్నారట. అలాగే, ఈ సినిమాతో పాటూ, రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబో మూవీ కూడా లేటెస్ట్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ లో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘గేమ్ ఛేంజర్’ సినిమా వుండబోతోంది. అలాగే, బుచ్చిబాబు సన సినిమా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఫార్మ్‌లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్‌లో స్వీట్‌న్డ్ డ్రింక్స్‌కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్‌లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్‌లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్







