సూర్య సినిమా 250 కోట్ల బడ్జెట్ తో

- June 04, 2016 , by Maagulf
సూర్య సినిమా 250 కోట్ల బడ్జెట్ తో

సౌత్ ఇండస్ట్రీలో లోకనాయకుడు కమల్ హాసన్ తరువాత ఎలాంటి ప్రయోగానికైనా సిద్ధంగా ఉండే స్టార్ హీరో సూర్య. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, అదే సమయంలో ప్రయోగాత్మక చిత్రాలతోనూ ఆకట్టుకుంటున్నాడు సూర్య. తాజాగా 24 సినిమాతో మంచి విజయం సాధించాడు. కాలంలో ప్రయాణించటం అనే వెరైటీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో తెలుగు, తమిళ భాషలతో పాటు ఓవర్ సీస్ లోనూ భారీ వసూళ్లను రాబట్టింది.ప్రస్తుతం సింగం సీరిస్ లో తెరకెక్కుతున్న సింగం 3 సినిమాలో నటిస్తున్న సూర్య, మరో ప్రతిష్టాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్షన్ లో భారీ పౌరాణిక చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైంది.
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ శ్రీ తెండ్రల్ ఫిలింస్ తమ వందో సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com