ప్రబాస్ సినిమాలో శ్రీలీల.?
- March 21, 2024
శ్రీలీలకు ఓ పక్క ఎంత డిమాండ్ వుందో.. మరో పక్క అంతే నెగిటివిటీ వుంది. అయినా కానీ, యూత్‌లో అమ్మడికి క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆ క్రేజ్‌తోనే వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటోందీ తెలుగమ్మాయ్.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మొదలుకొని పలు క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది శ్రీలీల. ఈ నేపథ్యంలోనే మరో బంపర్ ఆఫర్ శ్రీలీల తలుపు తట్టినట్టు తెలుస్తోంది.
ఆ ప్రాజెక్ట్ ఏంటయ్యా అంటే.! ప్రబాస్‌తో మారుతి తెరకెక్కిస్తున్న సినిమా. ‘రాజా సాబ్’ అనే టైటిల్‌తో ఈ సినిమా సైలెంట్‌గా షూటింగ్ జరిగిపోతోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు చోటుందట. ఆల్రెడీ మాళవికా మోహనన్ ఓ హీరోయిన్‌గా ఎంపికైంది.
మరో హీరోయిన్ ప్లేస్‌లో పలు పేర్లు వినిపిస్తున్నాయ్. తాజాగా శ్రీలీలను ఓ హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాడట దర్శకుడు మారుతి.
అయితే, శ్రీలీల ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్టులకి సంబంధించి డేట్లు అడ్జస్ట్ అవుతాయా.? లేదా.? అనే డైలమాలో వుందట. కానీ, ప్రబాస్ సినిమా అంటే ప్యాన్ ఇండియా సినిమా. సో, వదులుకునే ప్రశక్తే వుండదు. మెయిన్ లీడ్ హీరోయిన్ కాదు కాబట్టి.. ఎలాగైనా సరే, డేట్స్ అడ్జస్ట్ చేసేలానే ప్రయత్నిస్తోందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష