మరో చిరంజీవుడి కథకు రంగం సిద్ధమవుతోంది.!
- March 22, 2024
పురాణాల్లో చిరంజీవుల గాధలకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ వుంది.హనుమంతుడితో సహా ఏడుగురు చిరంజీవులున్నారని చెబుతుంటారు.
హనుమంతుడి కథతో వచ్చిన ‘హనుమాన్’ ఇటీవల ఏ స్థాయిలో విజయం అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరో చిరంజీవి గాధ పురుడు పోసుకుంటోంది సిల్వర్ స్ర్కీన్‌పై సంచలనాలు సృష్టించేందుకు.
ఆయన మరెవరో కాదు.. ‘అశ్వధ్దామ’. ‘అశ్వధ్ధామ హతహ కుంజరహ..’ అనే వాక్యం గురించి పురాణాలపై ఏ చిన్నపాటి అవగాహన వున్నా తెలుస్తుంది. ఆ అశ్వధ్ధామ చిరంజీవుడే. ఈయన కథా ఇతివృత్తంతోనే త్వరలో ఓ సినిమా రాబోతోందట.
బాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాని తెలుగు తదితర భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సచిన్ రవి దర్శకత్వం వహిస్తున్నారు.
‘అశ్వద్ధామ ది సాగా కంటిన్యూస్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో అశ్వద్ధామ ఇంకా బతికే వున్నాడన్న పాయింట్ కూడా చూపించబోతున్నారట.
అయితే, ఈ సినిమాని ఈ తరం ప్రేక్షకులకు అర్ధమయ్యే రీతిలో కాదు కాదు, అప్పటి అశ్వద్ధామ నేటి సమాజంలో జీవించి వుంటే.. ఆయన ఎదుర్కొనే పరిస్థితులు ఎలా వుండబోతున్నాయ్ అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందబోతోందట. చూడాలి మరి, ఈ నయా ప్రాజెక్ట్‌కి ఏ రేంజ్ ఆదరణ దక్కేుతుందో.!
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష