హోలీ పండుగ...!

- March 25, 2024 , by Maagulf
హోలీ పండుగ...!

ఏడాది పొడవునా ఎదురుచూసే పండుగలలో హోలీ కూడా ఒకటి. ఈ రోజున ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. ఇది చలికాలం తొలగి పోయి ఎండాకాలం ఆరంభానికి నాంది ప్రస్థావన వంటిది. హోలీ పండుగను సాధారణంగా “ఫాల్గుణి పూర్ణిమ” నాడు జరుపుకుంటారు. 

గ్రీష్మరుతువు ఆరంభంలో, వసంత రుతువు చివరలో ఫాల్గుణ మాసం పౌర్ణమినాడు కామదహనం చేసి మరుసటి రోజు రంగులు చల్లుకొని హోలీ నిర్వహించడం ఆనవాయితీ.

ఈ రంగుల పండుగ భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్ మరియు భారతీయులు నివసిస్తున్న పలు దేశాల్లో కూడా జరుపుకుంటారు.హోలీ పండుగ అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసం లేదా మార్చి మాసంలో వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 25న వచ్చింది.  

పురాణాల ప్రకారం పూర్వం హోలిక అనే రాక్సి ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతుండగా ,ప్రజలందరూ కలిసి అవతార పురుషుడైన  విష్ణుమూర్తిని  ప్రార్థించగా, వారి మొరను ఆలకించి హోలికా అంతం చేయడం వల్ల ప్రజలందరూ ఆనందోత్సవాలతో రంగులు చల్లుకొని ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. అందుకే దీనిని "హోలిక పౌర్ణమి" అని కూడా అంటారు.

హోలీ కేవలం పిడకలు, కర్ర కుప్పలను మాత్రమే కాల్చే పండుగ కాదు,చిత్తం యొక్క బలహీనతను దూరంచేసుకోవడానికి మరియు మనసులోని మలినమైన వాసనలను కాల్చడానికి ఇది పవిత్రమైన రోజు.

హోలీ పండుగ జరుపుకోవడం వల్ల చర్మ సౌందర్యంతో పాటు వ్యాయామం కూడా అవుతుంది.  రంగులను శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యం పదిల పడుతుందని విజ్ఞాన శాస్త్రం తెలుపుతుంది. 


--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com