రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసులో నిందితుడిపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డు
- March 29, 2024
బెంగళూరు: బెంగళూరు సిటీలోని రామేశ్వరం కేఫ్ లో బాంబు పెట్టిన ఇద్దరు అనుమానితుల ఫొటోలను రిలీజ్ చేసింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA.. వీరి పేర్లు ముసావీర్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్.
వీరిలో ముసావీర్ హుస్సేన్ కీలక సూత్రధారిగా చెబుతోంది ఎన్ఐఏ. ఈ పేలుళ్ల కేసులో అరెస్ట్ అయిన ముజ్మిల్ ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించారు విచారణ అధికారులు.
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పరారీలో ఉన్న నిందితులు ముసావీర్ హుస్సేన్, అబ్దుల్ మంతెన్ కోసం పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిందితుల ఆచూకీ తెలిపితే 10 లక్షల రివార్డ్ ఇస్తామని ప్రకటించింది ఎన్ఐఏ. నిందితుల ఆచూకీ తెలిపిన వారి విషయాలు గోప్యంగా ఉంచుతామని చెప్పింది.
బెంగళూరులోని కుండలహళ్లిలో ఉన్న రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన బ్లాస్ట్ కు అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా , ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్‌లకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు పోలీసులు. అయితే వీళ్లిద్దరు నిందితులు తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు విగ్గులు, నకిలీ గడ్డాలతో మారువేషాలు వేస్తూ తిరుగుతున్నారని ఎన్ఐఏ వెల్లడించింది.
ఇప్పటికే కీలక సూత్రధారి ముజ్మిల్‌ను షరీఫ్ ను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. షరీఫ్ మరో ఇద్దరు నేరస్తులకు పేలుడ పదార్థాలు సమకూర్చుడం, టెక్నికల్ సహాయం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 3 వరకు షరీఫ్ కు కస్టడీ విధించింది ఎన్ఐ కోర్టు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..