ముగిసిన ఎక్స్‌పో 2023 దోహా..రికార్డు స్థాయిలో సందర్శకులు

- March 30, 2024 , by Maagulf
ముగిసిన ఎక్స్‌పో 2023 దోహా..రికార్డు స్థాయిలో సందర్శకులు

దోహా: ఇంటర్నేషనల్ హార్టికల్చరల్ ఎక్స్‌పో 2023 దోహా  ఘనంగా ముగిసింది.  నాలుగు మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో మొదటి A1 అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శన 2023 అక్టోబర్ 2 నుండి మార్చి 28 వరకు అల్ బిడ్డా పార్క్‌లో జరిగింది. ముగింపు వేడుకలో ఉద్దేశించి మునిసిపాలిటీ మంత్రి హెచ్ఇ అబ్దుల్లా బిన్ హమద్ బిన్ అబ్దుల్లా అల్ అత్తియా మాట్లాడుతూ.. ప్రారంభించిన 179 రోజులలో 77 దేశాల భాగస్వామ్యంతో ఎక్స్‌పో 2023 దోహా సుమారు 4,220,000 మంది సందర్శకులను ఆకర్షించిందని తెలిపారు. ఈ వేడుకకు మంత్రులు, దౌత్యవేత్తలు, ఉన్నతాధికారులు, అతిథులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 54 జాతీయ వేడుకలు, 124 సదస్సులు మరియు సెమినార్‌లు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల కోసం 198 ఈవెంట్‌లు, 600 రంగస్థల ప్రదర్శనలతో సహా సుమారు 7,000 ఈవెంట్‌లను నిర్వహించినట్లు ఆయన వివరించారు. "ఎక్స్‌పోలో సుస్థిరత, పర్యావరణ అవగాహన, ఆధునిక వ్యవసాయం, సాంకేతికత మరియు వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు వంటి అంశాల గురించి 1,727 వర్క్‌షాప్‌లను నిర్వహించారు." అని మంత్రి చెప్పారు. ఎక్స్‌పో 2023 దోహా అంతర్జాతీయ ఉద్యాన ప్రదర్శనల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని, ఇది మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో జరుగుతున్న మొదటి A1 ప్రదర్శన అని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com