డాక్టర్స్ డే...!

- March 30, 2024 , by Maagulf
డాక్టర్స్ డే...!

కనిపించని దైవాన్ని పూజిస్తాము. కనిపించే దైవంగా డాక్టర్లను భావిస్తాము. నిత్యం రకరకాల అనారోగ్యాలు, యాక్సిడెంట్లతో ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్స్ కి వచ్చే వేలాది మంది పేషెంట్ల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పని చేస్తారు. వారి నిస్వార్థ అంకితభావం గురించి అవగాహన పెంచడానికి డాక్టర్స్ డే  ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో డాక్టర్స్ డేను పాటించే తేదీ మారవచ్చు. కానీ యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్ అమెరికాలో మాత్రం డాక్టర్స్ డేను మార్చి 30న జరుపుకుంటారు.

ప్రతి ప్రొఫెషన్‌కి ఓ టైమ్ అంటూ ఉంటుంది. కానీ, కొన్నింటికి అసలు టైమింగ్స్ అసలు ఉండవు. మనకి ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఎదురైతే అప్పుడు వెళ్తాం. అలాంటప్పుడు డాక్టర్స్ ఎలా ప్రాణాలు కాపాడతారు.డాక్టర్స్ పేషెంట్ కి బాధ కలుగకుండా చేసే చికిత్సపై దృష్టి పెడతారు. రోగి త్వరగా కోలుకునేలా చేస్తారు. ఒకవేళ ఒకరికి నయం చేయలేని వ్యాధి వస్తే వారు తమ మిగిలిన జీవితాన్ని హాయిగా గడిపేందుకు కృషి చేస్తారు.

ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం డాక్టర్స్ చేసిన సేవలను గౌరవించడం మన విధి.ఆరోగ్య రక్షణకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడంలో వారి పాత్ర ఎంతో కీలకమైనది. కనిపించే దేవుడు వైద్యుడు. మన ప్రాణాల్ని కాపాడటానికి అహరహం పనిచేసే వైద్యుల సేవలకు ఏమిచ్చినా రుణం తీరదు.

                                 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com