రంగపంచమి...!

- March 30, 2024 , by Maagulf
రంగపంచమి...!

హోలీ తర్వాత ఐదవ రోజున జరుపుకునే ప్రసిద్ధ పండుగ రంగపంచమి.ఇది ప్రేమ మరియు సంతోషాలకు నిలయమైన పండుగ.ఈ  సంవత్సరం మార్చి 30వ తేదీన రంగ పంచమిని జరుపుకోనున్నారు. ఈ రోజున కృష్ణుడు రాధతో హోలీ ఆడాడని చెబుతారు.రంగ పంచమి పండుగను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో  ఘనంగా జరుపుకుంటారు.  

రంగ పంచమి రోజున కూడా ప్రజలు హోలీ ఆడతారు. రకరకాల వంటలు చేసి కలిసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ రోజు రాధాకృష్ణులను భక్తి భావంతో పూజిస్తారు. వసంతకాలం ప్రారంభాన్ని ఈ పండుగ సూచిస్తుంది. ఫాల్గుణ మాసంలో ఎక్కువగా జరుపుకునే ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు.

సనాతన హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత ప్రకారం, రంగ పంచమి రోజున రంగులను ఉపయోగించడం సృష్టిలో సానుకూల శక్తిని ప్రసారం చేయడానికి దారితీస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీలో ప్రజలు దేవుళ్ల స్పర్శను అనుభూతి చెందుతారు.వివిధ రకాల పువ్వులతో చేసిన రంగులను ఆకాశంలో వెదజల్లడం  వల్ల రాజసిక మరియు తామసిక శక్తుల ప్రభావం తగ్గుతుంది, తద్వారా మనస్సులో సద్గుణ భావాలు ఏర్పడతాయి. ప్రేమ, సామరస్యం మరియు సోదరభావానికి చిహ్నంగా రంగపంచమి పరిగణించబడుతుంది.     
         
                                  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com