‘తమ్ముడు’ నితిన్ మాస్ మ్యాజిక్ చేయబోతున్నాడుగా.!

- March 30, 2024 , by Maagulf
‘తమ్ముడు’ నితిన్ మాస్ మ్యాజిక్ చేయబోతున్నాడుగా.!

ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే నితిన్ బోలెడంత కంటెంట్ ఇచ్చేశాడు తన తాజా సినిమా ‘తమ్ముడు’కి. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తమ్ముడు’.  నితిన్ హీరోగా రూపొందుతోన్న సినిమా ఇది.
తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్‌గా పెట్టుకున్నాడు. కాగా, ఈ రోజు నితిన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.
పోస్టర్‌ విషయానికి వస్తే.. బోలెడంత కంటెంట్, ఇన్‌ఫామేషన్ ఇచ్చేశారు ఈ పోస్టర్‌తోనే. ఓ లారీ మీద కూర్చుని ఏదో సాధించాలన్న కసితో కనిపిస్తున్నాడు హీరో నితిన్.
అంతేకాదు, చేతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుధం కూడా వుంది. ఇక లారీ మీద పైడి తల్లమ్మ దీవెన, ఫుణ్యవతి అని పేర్లు రాసి వున్నాయ్. లారీని ఓ గిరిజన మహిళ నడుపుతోంది. లారీలో చాలా మంది ప్రయాణికులు కనిపిస్తున్నారు.
మొత్తానికి కథేంటీ.? అనే సంగతి పక్కన పెడితే, ఈ పోస్టర్ మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com