ఉమ్ అల్ కువైన్ లో ధూమ్ ధామ్ గా జరిగిన 'తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ' వేడుకలు
- June 05, 2016
గత శుక్రవారం (తేది:03/06/2016) ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం (ETCA) అధ్వర్యంలో ఉమ్ అల్ కువైన్ లోని ఇండియన్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో సాయంత్రం 5 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .
సుమారు 500 మంది తెలంగాణీయులు దుబాయ్ , షార్జా , అజ్మాన్ , ఉమల్ కోయిన్ నుండి కార్యక్రమానికి హాజరు అయ్యారు . ETCA మహిళ విబాగం అధ్వర్యంలో చిన్న పిల్లల చే నిర్వహించిన నృత్యాలు , వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు హాజరు అయిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకొన్నాయి , ప్రముఖ నాట్యకారిని శ్రీమతి ప్రీతి గారు ప్రదర్శించిన శివ శంబో నృత్యం కార్యక్రమానికి స్పెషల్ నిలిచింది , శ్రీమతి విపుల, రిశిత , స్పందన చేసిన హాస్య బరితమైన కార్యక్రమం అందరిని అలరించింది , తెలంగాణ ప్రముఖల కాస్ట్యూమ్స్ చే నిర్వహించిన చిన్నపిల్లల ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది, వేడుకలకు హాజరు అయిన వారికి Real Taste Restaurant - షార్జా యాజమాన్యం వారు రుచికరమైన బోజన ఏర్పాట్లు చేసారు . కార్యక్రమానికి స్పాన్సర్ గా మల్బార్ గోల్డ్ సహయాన్ని అందించింది .
ఈ కార్యక్రమానికి ETCA Women Wing సభ్యులు శ్రీమతి రిశిత , శ్రీమతి స్పందన వ్యాఖ్యతలుగా వ్యవహరించారు , గణపతి స్తోత్రంతో ప్రారంబించిన వేడుకలు ముందుగా తెలంగాణ అమరవీరుల గొప్ప తనాన్ని స్మరిస్తూ ఘనమైన నివాళులు అర్పించారు ఈ సందర్బంగా ప్రొఫెసర్ జయ శంకర్ సర్ గారిని స్మరిస్తూ వారి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు , తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని తీసుకరావడానికి అహర్నిశలు శ్రమించిన రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి గొప్పతనాన్ని కొనియాడుతూ సభ ప్రాఘణం అంత జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది .
వేడుకలకు అద్యక్ష్యత వహించిన సంఘ వ్యవస్థాపకులు మరియు అద్యక్ష్యులు పీచర కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు, రాష్ట్ర సాధనలో బాఘస్వాములు అయిన ప్రతి తెలంగాణ బిడ్డకు పేరు పేరున అబినందనలు తెలియచేసారు , నాటి ఉద్యమం నుండి మలి దశ ఉద్యమం వరకు ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగ పలమే మనముంటున్న తెలంగాణ రాష్ట్రమని, చరిత్ర పుటల్లో వారి త్యాగం చిరస్మరణీయం నిలుస్తుందని బావితరాలకు వారి గొప్పతనాన్ని తెలియచెప్పేల మన కార్యక్రమాలు ఉండాలని అన్నారు . ఉమల్ కోయిన్ లో మొట్ట మొదటి కార్యక్రమం అని హాజరు అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు , దుబాయ్ లో ప్రారంబమైన ETCA, షార్జా, అజ్మాన్ లో కూడ కార్యక్రమాలు చేసి నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను UAQ లో నిర్వహించడం సంతోషధాయకమని ఇంకా అబుధాబి, అల్ అయిన్ , రస్ అల్ ఖైమా, ఫుజెరా లో కూడ కార్యక్రమాలు నిర్వహించి UAE లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు ETCA అందుబాటులో ఉంటుందని తెలిపారు . గత ఐదు సంవత్సరాలలో ETCA కృషికి పాటుపడిన సబ్యులంధరికి కృతజ్ఞతలు తెలియచేసారు .
ETCA ఊపాద్యక్ష్యులు మంచుకొండ వెంకటేశ్వరులు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు, ఐదు సంవత్సరాలుగా అద్యక్ష్యుడు కిరణ్ సారథ్యంలో నడుస్తున్న సంఘ పని తీరును ప్రశంసించారు , బవిష్యత్ లో సభ్యులందరు కలిసి ETCA ను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు, రాష్ట్ర ప్రబుత్వ పని తీరును ప్రశంసించారు , గల్ఫ్ సమస్యలపై KCR గారి ప్రబుత్వం దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరిస్తారని ఆశాబావం వ్యక్తం చేసారు , సేవ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, ఉపాది కై వస్తున్న యువతకు ETCA అండగా నిలువాలని కోరారు .
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆర్ధిక సహయం అందించిన ETCA సభ్యులు ఎలిగేటి శ్రీనివాస్ , కట్కం సాయి చందర్ , రవి వూత్నూరి, రాము , జగదీశ్ రావు , సురేష్ రెడ్డి , ఆకుల సురేందర్ , శేఖర్ గుండవేని , అరవింద్, నరేశ్ కుమార్ మాన్యం , అరవింద్ బాబు, రాజు సట్ల , శ్యాం గౌడ్ , కళ్యాణ్ గార్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియచేసారు .









తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







