‘ఇన్స్‌పెక్టర్ రిషి’.! నవీన్ చంద్ర ఓటీటీ హీరోనే.!
- April 01, 2024
‘అందాల రాక్షసి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. తొలి సినిమాతోనే మంచి విషయమున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ, సరైన అవకాశాలు రాక రేస్‌లో వెనకబడిపోయాడు.
అయినా కానీ, అడపా దడపా సినిమాలు చేస్తూనే వున్నాడు. మరోవైపు ఓటీటీ ట్రెండ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న తరుణంలో అక్కడ తన టాలెంట్ బాగా యూజ్ అవుతోంది నవీన్ చంద్రకి.
ఇప్పటికే పలు వెబ్ కంటెంట్లలో తానేంటో ప్రూవ్ చేసుకున్న నవీన్ చంద్ర, తాజాగా ‘ఇన్స్‌పెక్టర్ రిషి’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఓ గిరిజన తెగకు జరిగిన అన్యాయాన్ని అదే తెగకు చెందిన కొందరు యువత ఎలా ఎదుర్కొన్నారు. తమ తెగపై జరిగిన అన్యాయానికి ఎలా రివేంజ్ తీర్చుకున్నారు.. అనే కథాంశంతో రూపొందిన వెబ్ సిరీస్ ఇది.
హారర్ అంశాలు జోడించి, ఇంటెలిజెంట్‌గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నవీన్ చంద్ర నటించాడు. చాలా ప్రామిసింగ్‌గా వుంది నవీన్ చంద్ర నటన. సిరీస్ కూడా ప్రేక్షకుల మెప్పు పొందుతోంది.
స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే గ్రిప్పింగ్‌తో చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది ఈ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్‌తో నవీన్ చంద్ర ‘ఓటీటీ హీరో’ అయిపోయాడు. ఆ రేంజ్‌లో ఈ వెబ్ సిరీస్ దూసుకెళ్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు