రామ్ గోపాల్ వర్మకి చెల్లలేదు కానీ.!
- April 01, 2024
రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించడం.. వాటితో వైరల్ అవుతుండడం అలవాటుగా చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అయితే, ఈ మధ్య ఆయన ఆటలు సాగడం లేదు.
ఇటీవల ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు సినిమాలు తెరకెక్కించారు. రెండింటినీ ఒకేసారి రిలీజ్ చేసి సంచలనమైపోవాలనుకున్నారు. కానీ, పప్పులుడకలే.! రెండు సినిమాలూ విడుదలకు నోచుకోలేదు.
కానీ, ‘వివేకం’ అనే సినిమా ఒకటి ప్రస్తుతం యూ ట్యూబ్‌లో సంచలనమవుతోంది. సైలెంట్‌గా యూ ట్యూబ్‌లోకి వచ్చేసిన ఈ సినిమా దివంగత వివేకానంద రెడ్డి బయోపిక్‌గా రూపొందింది.
డైరెక్టర్ ఎవరో తెలీదు, తారాగణం గురించి అంతకన్నా తెలీదు. కానీ, సినిమా మాత్రం సెన్సేషనల్ అవుతోంది సోషల్ మీడియాలో. దివంగత నేత వివేకానంద రెడ్డి హత్యోదంతం నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు వేడి వేడిగా వున్న తరుణంలో ఈ సినిమాని సోషల్ మీడియా ద్వారా వీక్షించే వీక్షకులు ఎక్కువయ్యారు
విడుదలైన తొలి రోజే 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించి ఈ సినిమా సంచలనమవుతోంది. సినిమా పూర్తిగా చూడకున్నా.. కొన్ని డైలాగులయితే, నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయ్. రామ్ గోపాల్ వర్మకి చెల్లదేదు కానీ, ఊరూ పేరు లేకున్నా ఈ డైరెక్టర్ ‘వివేకం’ సినిమాని భలే క్యాష్ చేసుకుంటున్నాడులే.!
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు