జహ్రాలో ఇండియన్ పాస్‌పోర్ట్ సెంటర్ ప్రారంభం
- April 02, 2024
జహ్రాలో ఇండియన్ పాస్‌పోర్ట్ సెంటర్ ప్రారంభం
జహ్రా: కువైట్‌లోని భారత రాయబారి హెచ్.ఇ. డాక్టర్ ఆదర్శ్ స్వైకా ఏప్రిల్ 1వ తేదీన జహ్రాలో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ (ICAC)ని ప్రారంభించారు. ఇది ఎంబసీ యొక్క అవుట్‌సోర్సింగ్ భాగస్వామి M/s BLS ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహించబడుతున్న కువైట్‌లోని నాల్గవ ICAC. మిగిలిన మూడు కువైట్ నగరంలో ఫహాహీల్ , జిలీబ్ ఉన్నాయి. జహ్రా ICAC అనేది కువైటీలకు భారతీయ వీసాలు, జహ్రా మరియు దాని పొరుగు ప్రాంతాలలో అబ్దాలీ వరకు నివసిస్తున్న భారతీయ పౌరులకు వివిధ కాన్సులర్ సేవలను సులభతరం చేయనుంది. అమ్నెస్టీకి సంబంధించిన ప్రయాణ పత్రాలు కూడా ఇక్కడ ప్రాసెస్ చేయనున్నారు. జహ్రాలోని కేంద్రం అబ్దల్లీ ప్రాంతంలోని కార్మికులతో సహా ఈ ప్రాంతంలో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో భారతీయులకు ఈ సెంటర్ సహాయకారిగా ఉంటుందని భారత రాయబారి అన్నారు. ఈ ప్రాంతంలోని కువైట్ పౌరులకు భారతీయ వీసా సంబంధిత పత్రాలను పొందేందుకు కేంద్రం సహాయం చేస్తుందని, భారతదేశానికి వచ్చే కువైట్ సందర్శకుల సంఖ్య సంవత్సరాలుగా పెరుగుతోందని తెలిపారు. కొత్త కేంద్రం దరఖాస్తు ప్రక్రియను మరింత వేగవంత చేస్తుందని తెలిపారు. పవిత్ర రమదాన్ మాసంలో జహ్రా కేంద్రం శనివారం నుండి గురువారం వరకు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కేంద్రం బిల్డింగ్ నెం. 27, అల్ ఖలీఫా భవనం, 2వ అంతస్తు, ఆఫీస్ 3 & 14, బ్లాక్ నెం. 93లో ఉంది. కొత్త కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌లో అందించే సేవల గురించి మరింత సమాచారం అప్‌డేట్‌ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ (http://www.indembkwt.gov.in) లేదా M/s BLS వెబ్‌సైట్ (http://www.blsinternational.com/india/kuwait/) సందర్శించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'