ఇరవై నాలుగు గంటలు ఎస్.పీ.బి పాటలను పాడి రికార్డుల్లోకి ఎక్కిన మధు బాపు
- April 03, 2024
హైదరాబాద్: ఏకధాటిగా ఇరవై నాలుగు గంటలు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాటలను పాడి రికార్డ్ సృష్టించిన మధు బాపు శాస్త్రి విఖ్యాత గాయకుడు బాలు మెచ్చిన గాయకుడు అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు ప్రశంసించారు.శ్రీ త్యాగరాయ గాన సభ లోని కళా సుబ్బారావు కళా వేదిక పై మనీషా ఆర్ట్స్ నిర్వహణలో వంశీ ఇంటర్నేషనల్ అభినందన లతో ప్రముఖ గాయకుడు మధు బాపు శాస్త్రి కి శోభన్ బాబు వంశీ ముజిక్ అవార్డ్ ప్రదాన సభ సంగీత భరితం గా జరిగింది.ముఖ్య అతిథిగా వంశీ రామరాజు పాల్గొని మాట్లాడుతూ వంశీ సంస్థను జ్యోతి ప్రజ్వలన చేసి నటుడు శోభన్ బాబు ఏబై ఏళ్ల క్రితం ప్రారంభించారని గుర్తు చేశారు.ఆయన సినిమాలలో పాటలను అద్భుతంగా గానం చేస్తున్న మధు బాపు తన ప్రతిభతో ఎంతో ఉన్నత స్థాయి కి చేరాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. సినీ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ త్వరలో మధు బాపు కు దాసరి నారాయణరావు అవార్డ్ ఇస్తామని ప్రకటించారు. మధు బాపు మాట్లాడుతూ శోభన్ బాబు, బాల సుబ్రహ్మణ్యం విగ్రహాలు హైదరాబాద్ నగరం లో ప్రతిష్ఠ కోసం కృషి చేయాలని కోరారు.వేదిక పై కృష్ణ ప్రసాద్, సంగీత దర్శకుడు శ్రీధర్ ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు తొలుత మధు బాపు, శ్రీదేవి,రేవతి, శ్రీకాంత్ స్వప్న, సాయి సింధూర తదితరులు పాడిన పాటలకు కిక్కిరిసిన శ్రోతలు ముగ్ధ లైనారు.
తాజా వార్తలు
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..







