‘ఫ్యామిలీ స్టార్’ ఇది నిజంగా స్పెషల్ సుమా.!
- April 03, 2024
ఫ్యామిలీ స్టార్ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగా, ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటూ, ఓవర్సీస్లోనూ గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.
ఓవర్సీస్లో విజయ్ దేవరకొండ సినిమాలకు మాంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. అలాగే, గత చిత్రాలతో పాటూ, ఈ సినిమాని కూడా అదే అంచనాలతో అక్కడ రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, సౌత్ అమెరికాలోని ఉరుగ్వే దేశంలో ఈ సినిమా రిలీజ్ కాబోతోందట. ఇంతవరకూ ఏ తెలుగు సినిమా కూడా ఈ దేశంలో రిలీజ్ కాలేదని సమాచారం.
ఆ క్రెడిట్ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకే దక్కింది. నిజంగా విజయ్ దేవరకొండకు ఇది అరుదైన అవకాశమే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాల్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







