అరుదైన చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- April 03, 2024హైదరాబాద్: ఖమ్మం జిల్లాకు చెందిన రావు వయసు 65 సంవత్సరాలు దగ్గు మరియు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ పవన్ కుమార్ జొన్మడ, సర్జికల్ ఆంకాలజిస్ట్ ని సంప్రదించడం జరిగింది. అతన్ని పరీక్షించిన డాక్టర్ స్కానింగ్ చేయించడం జరిగింది. అందులో అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్ కణితి ఉన్నదని గుర్తించడం జరిగింది.
సాధారణంగా ఇటువంటి పేషెంట్స్ లో చాలామంది పెద్ద కోతతో ఛాతి కుహరాన్ని తెరిచి ఊపిరితిత్తుల లోబ్ మరియు కణితి తీసేయడం జరుగుతుంది. కానీ మేము ఈ పేషెంట్ లో అతి తక్కువ కోతతో (మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ద్వారా)ఊపిరితిత్తులలో ఉన్న క్యాన్సర్ కణితిని తొలగించి రోగి ప్రాణాలను కాపాడటం జరిగింది. వయసురీత్యా అతనికి ఇటువంటి సర్జరీ అతనికి ఎంతో ఉపయోగపడుతుంది.
అనంతరం డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఊపిరితిత్తుల లోబ్ తీసేయడం, క్యాన్సర్ కణితిని తొలగించడం లాంటి సర్జరీలేవైనా ఇంతకుముందు అయితే పెద్ద కోతతో ఛాతి కుహరాన్ని తెరిచి చేసేవాళ్లు. ఇందుకోసం ఎటువైపు సమస్య ఉందో అటు పక్క భుజం కింద సగం యు ఆకారంలో పెద్ద గాటు పెడ్తారు. కోత పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ సర్జరీ వల్ల నొప్పి ఎక్కువగా ఉంటుంది. రక్తస్రావం కూడా ఎక్కువే. సర్జరీ తరువాత పేషెంటు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఓపెన్ సర్జరీ చేయించుకున్న తరువాత వారం నుంచి 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి. సర్జరీ తరువాత ఎప్పటిలా కోలుకోవడానికి 3 నెలలు పడుతుంది. పూర్తి స్థాయి రికవరీ ఉండదు. ఈ సర్జరీ ద్వారా థొరాకోటోమీ చేస్తారు. అంటే భుజం కింద పెద్ద కోత పెట్టడం. ఇందుకోసం 4 కండరాలను కట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సర్జరీ తరువాత ఈ కండరాలు బలహీనం అయ్యే అవకాశం ఉంటుంది. భుజం పనితీరు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు చేసిన సర్జరీ హాస్పిటల్‌లో 3 రోజులుంటే సరిపోతుంది. చిన్న కొతతో మనం ఊపిరితిత్తుల లోబ్ మరియు కణితిని తొలగించడం దానికి కేవలం రెండు కుట్లు మాత్రమే పడ్డాయి. ఒకట్రెండు వారాల్లో కోలుకుంటారు ఖర్చు కూడా తక్కువ అవుతుంది అని అన్నారు. ఈ యొక్క సర్జరీ వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకటం తగ్గుతుంది మరియు ఎక్కువ రోజులు వెంటిలేషన్ అవసరం పడదు. రోగి త్వరగా కోలుకొని సాధారణ స్థితికి వస్తారు.
పేషెంట్ మరియు అతని కుటుంభం సభ్యులు డాక్టర్ పవన్ గారికి ధన్యవాదములు తెలిపారు
తాజా వార్తలు
- తెలంగాణలో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
- భారీ భూకంపంతో కాలిఫోర్నియాలో సునామీ హెచ్చరికలు
- చికాగోలో NATS ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
- అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాన్స్ ప్రధాని బార్నియర్
- అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి సమన్లు జారీ చేసిన పోలీసులు
- యూఏఈలో కార్ వాష్ రూల్స్: మురికి వాహనాలపై Dh3,000 వరకు ఫైన్..!!
- విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
- చమురు ఉత్పత్తి కోతలను 3 నెలలు పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- 'దుక్మ్-1' రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒమన్..!!
- బహ్రెయిన్ ఫెస్టివిటీస్ 2024..12 క్రూయిజ్ షిప్‌లకు స్వాగతం..!!