విద్యార్థులను కాపాడిన వైరల్ వీడియో హీరో దొరికాడు..!

- April 04, 2024 , by Maagulf
విద్యార్థులను  కాపాడిన వైరల్ వీడియో హీరో దొరికాడు..!

దుబాయ్: యూఏఈలో కుండపోత వర్షాలు కురిసిన తరువాత దుబాయ్‌లో వదరలో చిక్కుకున్న పాఠశాల బస్సును బ్లాక్ SUVతో రక్షించిన మార్చి 9 నాటి ఐకానిక్ వీడియో గుర్తుందా? ఈ క్లిప్ వైరల్ అయ్యింది. కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. నెటిజన్ల కృషితో చివరకు ఆ వ్యక్తి ఆచూకీని కనుగొన్నారు. అతడి పేరు మాజిద్ ఫఖారీ. దుబాయ్ లోఉంటున్న ఇరానియన్. ఫఖారీ సిలికాన్ ఒయాసిస్ గుండా వెళుతుండగా వరదలో ఓ పాఠశాల బస్సు చిక్కుకోవడం గమనించినట్లు తెలిపారు.  ఆ సమయంలో బస్సులో సుమారు 10 మంది పిల్లలు ఉన్నారని గమనించాడు. "నేను వెంటనే బస్సును వేరే ప్రదేశానికి తరలించాలని నిర్ణయించుకున్నాను. తద్వారా అందరూ సురక్షితంగా బయటపడవచ్చు. 'డూన్ రైడర్స్' అనే స్థానిక క్లబ్‌తో గడిపిన సమయంలో నేర్చుకున్న టెక్నిక్‌లను ఉపయోగించాను. బస్సును తన వాహనానికి కట్టి దానిని నీటిలో నుండి బయటకు తీయగలిగాను.’’ అని ఫఖారీ ఆనాటి విషయాలను షేర్ చేసుకున్నాడు.  ఆ సమయంలో ఎవరో వీడియో తీస్తున్నట్లు తనకు తెలియదని ఫఖారీ చెప్పాడు. "నేను నా మానవతా మరియు పౌర విధులను నెరవేర్చాను" అని పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com