మే 3న ‘కృష్ణమ్మ’ రిలీజ్
- April 05, 2024
హైదరాబాద్: పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయినా నటనకు ప్రాధాన్యముందంటే, ఆటోమేటిగ్గా అందరి చూపులూ హీరో సత్యదేవ్ వైపు తిరగాల్సిందే. సినిమా రంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా కృష్ణమ్మ. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా కృష్ణమ్మ మూవీ తెరకెక్కుతోంది. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. కొరటాల శివ సమర్పిస్తున్న సినిమా ఇది. కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 3 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా...
నిర్మాత కృష్ణ కొమ్మలపాటి మాట్లాడుతూ ''రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన సినిమా ఇది. టైటిల్ కృష్ణమ్మ అని ఎందుకు పెట్టామో, సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన సత్యదేవ్ కచ్చితంగా ఈ సినిమాతో మరో రేంజ్‌కి చేరుకుంటారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి, పాటలకి చాలా మంచి స్పందన వస్తోంది. కాలభైరవ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వేసవి కానుకగా మే 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.
దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ మాట్లాడుతూ ''స్నేహానికి ఉన్న విలువను ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టైటిల్ సాంగ్‌లోనే హీరోకి, అతని స్నేహితుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాం. ఇంటెన్స్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సమ్మర్‌కి ఓ బెస్ట్ సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది'' అని చెప్పారు.
ఈ సినిమాలో సత్యదేవ్‌కి జోడీగా అతీరారాజ్ నటించారు. లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ కీలక పాత్రల్లో నటించారు.
నటీనటులు:
సత్యదేవ్, అతీరా రాజ్, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు
సాంకేతిక వర్గం:
సమర్పణ - కొరటాల శివ, బ్యానర్ - అరుణాచల క్రియేషన్స్, నిర్మాత - కృష్ణ కొమ్మలపాటి, రచన, దర్శకత్వం - వి.వి.గోపాలకృష్ణ, సంగీతం - కాల భైరవ, సినిమాటోగ్రఫీ - సన్నీ కూరపాటి, ఎడిటర్ - తమ్మిరాజు, ఆర్ట్ - రామ్ కుమార్, పాటలు - అనంత శ్రీరాం, ఫైట్స్ - పృథ్వీ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రవి సూర్నెడ్డి, పి.ఆర్.ఒ - వంశీ కాకా.
తాజా వార్తలు
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!









