కువైట్ జాతీయ ఎన్నికల్లో 62.1 శాతం పోలింగ్

- April 06, 2024 , by Maagulf
కువైట్ జాతీయ ఎన్నికల్లో 62.1 శాతం పోలింగ్

కువైట్: 2024 జాతీయ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని జిల్లాల్లో ఓటింగ్ శాతం 62.1 శాతానికి చేరుకుందని, ఓట్లు వేసిన వారి సంఖ్య 518,365 మంది పురుష మరియు స్త్రీ ఓటర్లకు చేరుకుందని సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2024 జాతీయ అసెంబ్లీ ఎన్నికల విజయానికి సహకరించిన మంత్రులు, స్టేట్ ఏజెన్సీల అధిపతులకు హిస్ హైనెస్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా ధన్యవాదాలు తెలియజేసారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగపరమైన ఓటు హక్కును వినియోగించుకున్నందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com