గీతాంజలి మళ్లీ వచ్చింది.! ఈ ప్రమోషన్ సరిపోతుందా.?
- April 06, 2024
తెలుగమ్మాయ్ అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకి ఇంతవరకూ అయితే, పాజిటివ్ సైన్ కనిపించడం లేదు.
వచ్చే శుక్రవారం అనగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. పోస్టర్లు బాగా డిజైన్ చేసినప్పటికీ, ట్రైలర్ కట్ మాత్రం ఏమంత ఆకట్టుకోలేదు.
సో, ‘గీతాంజలి’ మళ్లీ వచ్చింది’ నిలదొక్కుకోవడం కష్టమేనేమో అన్న అనుమానాలొస్తున్నాయ్. అయితే, ప్రోమోలు కొన్ని సార్లు నిరాశపరిచినా.. రిలీజ్ తర్వాత రిజల్ట్ పాజిటివ్‌గా రావచ్చు. హాలీడేస్ సీజన్ ఎలాంటి సినిమా అయినా వర్కవుట్ అవుతుంది.
ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అసలు సిసలు పండగే మరి. ఇంకాస్త ప్రమోషన్ల విషయంలో గట్టిగా ప్రయత్నిస్తే ఫలితాలు మారే అవకాశాలున్నాయని సినీ మేథావులు అభిప్రాయపడుతున్నారు.
అయినా అక్కడున్నది కోన వెంకట్. సినిమాని మార్కెట్ చేసుకోవడంలో కోన వెంకట్ రూటే సెపరేటు. సో, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ రిజల్ట్ ఎలా వుండబోతోందో చూడాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







