‘ఫ్యామిలీ స్టార్’ అందులో సక్సెస్ అయ్యాడు.!
- April 06, 2024
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ హీరో అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. సెన్సేషనల్ హిట్ అయితే కొట్టాడు కానీ, యూత్ స్టార్, రౌడీ స్టార్ అనే ట్యాగ్ మాత్రమే దక్కించుకున్నాడింతవరకూ.
కానీ, లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండ ట్యాగ్ మార్చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి పోటెత్తుతున్నారు. ప్రీమియర్ షోలతో పాటూ, ఓపెనింగ్స్‌లోనూ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనిపిస్తుండడం విశేషం.
దీంతో ఇంతవరకూ రౌడీ.. రౌడీ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ ‘ప్యామిలీ స్టార్’ అని పిలుచుకునే స్థాయికి వచ్చేశాడు. ఈ ట్యాగ్ రావడం ఏమంత ఈజీ టాస్క్ కాదు. కానీ, విజయ్ దేవరకొండ సాధించేశాడు. ఇకపోతే, ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వస్తోంది.
అయినా హాలీడేస్‌లో సినిమా కొట్టుకెళ్లిపోతుందనడం అతిశయోక్తి అనిపించదేమో. ఈ టైమ్‌లో ఇలాంటి ఓ కూల్ అండ్ క్లీన్ మూవీలు చాలా అరుదుగా వస్తున్నాయ్. డైరెక్టర్ పరశురామ్, అండ్ విజయ్ దేవరకొండ ఇంకాస్త దృష్టి పెట్టి వుంటే.. ఈ సినిమాకి అవుట్ పుట్ ఇంకా బాగా వచ్చి వుండేది అని ఫ్యామిలీ ఆడియన్సే రివ్యూలిస్తున్నారు. సో, విజయ్ విజయం సాధించినట్లే.!
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







