‘పుష్ప మాస్ జాతర’ మొదలైందిగా.!
- April 06, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రమోషన్లు మొదలెట్టేశాడనిపిస్తోంది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
ఎటువంటి అంచనాల్లేకుండా వచ్చిన ‘పుష్ప’ మొదటి పార్ట్ ఊహించని విధంగా సంచలనాలు నమోదు చేసింది. ఆ అంచనాలను దాటి వుండేలా ఈ రెండో పార్ట్ చిత్రీకరిస్తున్నారు సుక్కు అండ్ టీమ్.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మరో రెండు రోజుల్లో అనగా ఏప్రిల్ 8న మరో సర్ప్రైజ్ రానుందని ఓ లేటెస్ట్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ కన్ఫామ్ చేసింది.
ఆ సర్ప్రైజ్ ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే అంశంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ మొదలైంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుండగా, మైత్రీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







